మాదాపూర్, సెప్టెంబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): అన్నమాచార్య భావనా వాహిని వ్యవస్థాపక అధ్యక్షురాలు, పద్మ శ్రీ పురస్కార గ్రహీత డా. శోభా రాజు అధ్వర్యంలో శనివారం వినాయక చవితి, అన్నమ స్వరార్చన స్వామి వారి సంకీర్తనలతో ఘనంగా జరిగింది. తొలుతగా విష్ణు సహస్రనామ స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, అన్నమాచార్య అష్టోత్తర శతనామావళి, అన్నమ గాయత్రి అనే గురు స్తుతి తో ప్రారంభించగా, అన్నమ స్వరార్చనలో భాగంగా తనయ నృత్యార్చన, స్రవంతి ఆర్ట్స్ అకాడమీ శిష్యుబృందం స్వరార్చన చేశారు. ఇందులో తనయ,శ్రీవిద్య, శ్రావ్య, శ్రీనిక, సుధీశ్, మృదంగం పవన్ కుమార్, డా. శిరీష కాశినాధుని కలిసి కట్టుగా గణేశ పంచరత్నం, ముద్దుగారే యశోద, వచ్చెను అలమేలు మంగ అనే సంకీర్తనలకు నృత్యాభినయం చేయగా, అకాడమీ శిష్యులు సంయుక్తంగా, వేడుకుందామా, తిరువీథుల మెరిసి, నగుమోము, ఇట్టి ముద్దులాడే అనే అన్నమయ్య సంకీర్తనలను మధురంగా పాడి అలరించారు.
శ్రీ స్వర సిద్ధి వెంకటేశ్వర స్వామివారిని భక్తి పూర్వకంగా సేవించి అందరినీ ఆనందపరిచారు. అనంతరం డా. శోభా రాజు ఓ అన్నమయ్య సంకీర్తనకు విశ్లేషణ ఇచ్చారు. అనంతరం కళాకారులకు శోభా రాజు ఙ్ఞాపికలను అందించారు.