ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో నాలా పరిసర ప్రాంతాలను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. నాలా ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. నాలాను ఆక్రమించి ఏర్పాటుచేసి నిర్మాణాలను ఎట్టి పరిస్థితిలో తనదైనను తెలిసిన వారిదైనను నిక్కచ్చిగా తొలగించాలని అధికారులకు సూచించారు. ఎట్టి పరిస్థితిలో తొలగించేలా చర్యలు తీసుకుంటామని దీని ద్వారా వరద నీరు కాలనీలోకి రాకుండా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బోయ కిషన్, నరసింహాచారి, డివిజన్ తెరాస అధ్యక్షుడు జిల్లా గణేష్, ఎస్ఆర్పీ సత్యనారాయణ, వార్డు సభ్యులు చిన్నొళ్ళ శ్రీను, కాశీనాథ్ యాదవ్, ఏరియా కమిటీ సభ్యులు వెంకటేష్, మున్నా బాయ్, రాములు గౌడ్, బీసీ నాయకుడు రాజేష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.