- పాల్గొన్న ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్లు
నమస్తే శేరిలింగంపల్లి: దీపావళి పర్వదినంను పురస్కరించుకుని గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గంలో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో సదర్ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం సీఐ మహేష్, కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కార్పొరేటర్ సాయి బాబా, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. దున్నపోతుల విన్యాసాలను చూసి తరించారు. కార్యక్రమంలో తెరాస నాయకులు కృష్ణ యాదవ్, సంపత్, నరేష్, సతీష్, శ్రీకాంత్, అశోక్, సల్లావుద్దీన్, వేణు గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.