సరికొత్త వెలుగుల కాంతి

  • శేరిలింగంపల్లి 100 ఫీట్ లింక్ రోడ్డు లో 30 లక్షల 99 వేల 963 రూపాయలతో..
  • జర్నలిస్ట్ కాలనీలో రూ. 16 లక్షల వ్యయంతో
  • విభాగి వీధీ దీపాల ఏర్పాటు
  • కార్పొరేటర్లతో కలిసి ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం ఎదురుగా 100 ఫీట్ లింక్ రోడ్డు లో 30 లక్షల 99 వేల 963 రూపాయల అంచనావ్యయంతో.. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని జర్నలిస్ట్ కాలనీ లో రూ. 16 లక్షల రూపాయల అంచనా వ్యయంతో రోడ్డు డివైడర్ (విభాగిని) పై ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ( విభాగీ వీధి దీపాలను ) శేరిలింగంపల్లి 100 ఫీట్ లింక్ రోడ్డు లో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో… జర్నలిస్ట్ కాలనీ లో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిలతో కలిసి వాటిని ప్రారంభించారు. అనంతరం విప్ గాంధీ మాట్లాడారు. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం ఎదురుగా 100 ఫీట్ లింక్ రహదారి, గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని జర్నలిస్ట్ కాలనీ విభాగిని విధి దీపాల వెలుగులతో ప్రకాశవంతంగా మెరిసిపోతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. వీధి దీపాల ఏర్పాటుతో రోడ్డు పై వెళ్లే వాహనదారులకు, పాదచారులకు వెలుతురులేమి సమస్యతో ఇబ్బందులు తీరిపోయాయని, సాఫీగా ప్రయాణం సాగేలా విధి దీపాలు దోహదపడతాయని పేర్కొన్నారు. శేరిలింగంపల్లి ని యోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో స్ట్రీట్ లైట్ EE ఇంద్రదిప్, DE మల్లికార్జున్ , AE రాజశేఖర్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , తెరాస నాయకులు మంత్రి ప్రగడ సత్యనారాయణ, జంగయ్య యాద వ్, సురేందర్ ,MD ఇబ్రహీం, విష్ణు వర్ధన్ రెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు.

శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం ఎదురుగా 100 ఫీట్ లింక్ రోడ్డు లో సెంట్రల్ లైటింగ్ ను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని జర్నలిస్ట్ కాలనీ లో కార్పొరేటర్ గంగాధర్ రెడ్డితో కలిసి ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here