కేంద్ర పథకాలు తెలంగాణలోనే అమలు కావడం లేదు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

  • లోక్ సభ ప్రవాస్ యోజనలో భాగంగా శేరిలింగంపల్లిలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి సందడి
  •  దళిత మోర్చా డివిజన్ అధ్యక్షుడు ఇంట్లో అల్పాహారం
  •  కొండాపూర్ ఏరియా హాస్పిటల్ లో కోవిడ్ కేర్ సెంటర్ సందర్శన
  • ప్రధాని మోడీకి భారతదేశం అంతా ఒక కుటుంబం అన్న జోషి
  • మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే అని ధీమా వ్యక్తం

నమస్తే శేరిలింగంపల్లి: దేశంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని పార్లమెంట్ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషీ జోస్యం చెప్పారు. లోక్ సభ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో మూడు రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సందడి చేశారు. ఉదయం హైదర్ నగర్ డివిజన్ లోని దళిత మోర్చా అధ్యక్షులు సిద్ది నర్సింగ్ నివాసంలో అల్పాహారం చేసిన మంత్రి ఆ తర్వాత కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలోని కోవిద్ కేర్ సెంటర్ ను పరిశీలించారు. అనంతరం మదీనగూడలోని కినారా గ్రాండ్ హోటల్ లో జరిగిన చేవెళ్ల పార్లమెంట్ కోర్ కమిటీ, జిల్లా పధాధికారుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

హైదర్ నగర్ డివిజన్ బిజెపి దళిత మోర్చా అధ్యక్షుడు సిద్ది నర్సింగ్ నివాసంలో అల్పాహారం చేస్తున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో స్థానిక నేతలు

ఈ సందర్భంగా నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి మోదీ కి భారదేశం అంతా ఒక కుటుంబంగా బావిస్తున్నారని, తెలంగాణలో మాత్రం కుటుంబ పాలన నడుస్తుందని అన్నారు. కొవిడ్ ఆపత్కాల సమయంలో 2 కోట్లకుపైగా వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రం పూర్తి చేసిందని వెల్లడించారు. కరోనా వ్యాప్తి నివారణలో, ఆర్థికంగా పుంజుకోవడంలో భారతదేశం ముందంజలో ఉందన్నారు. కేంద్ర పథకాలను తెలంగాణలో మాత్రమే అమలు చేయడం లేదన్నారు.

కొండాపూర్ ఏరియా హాస్పిటల్ కు విచ్చేసిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి అక్కడి పరిస్థితులను వివరిస్తున్న సూపరిండెంట్ వరదాచారి

ప్రజా పంపిణీ వ్యవస్థలోనూ 85 శాతం కేంద్రం సబ్సిడీ అందిస్తుండగా తెలంగాణ 15 శాతం మాత్రమే ఇస్తుందన్నారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో మొదట రూ. 40 వేల కోట్లతో ప్రారంభించి ఇప్పుడు రూ. 1, లక్ష 20 కోట్ల కు మార్చారని దుయ్యబట్టారు. పీ ఎం అవాస్ యోజన కింద కేంద్రం అందిస్తున్న వాటిని రాష్ట్రం అమలుపరచడం లేదన్నారు. అందులో డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం ఇప్పటికే 2 లక్షలు కేంద్రం ఇచ్చిందన్నారు. ఓల్డ్ సిటీలో మెట్రో, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూం ఇళ్ల అంశాలపై కేసీఆర్ పై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ, డివిజన్, బూత్ స్థాయి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

జిల్లా పదాధికారుల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ప్రహ్లాద్ జోషీ, పక్కన కొండ విశ్వేశ్వరరెడ్డి, తుళ్ళ వీరేందర్ గౌడ్ సామ రంగారెడ్డి తదితరులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here