నమస్తే శేరిలింగంపల్లి: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి విరమణ చేసి నేడు హైదరాబాద్కు విచ్చేసిన సందర్భంగా ఆయనను ఘనంగా సత్కరించారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో సుప్రీం కోర్ట్ మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, అడుసు మిల్లి వెంకటేశ్వర రావు, కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, అభిమానులు పాల్గొన్నారు.