నిరంకుశ పాలన అంతమవ్వాలి

నమస్తే శేరిలింగంపల్లి : సిఎం కేసీఆర్‌ కబంధ హస్తాల్లో చిక్కుకున్న తెలంగాణకు విముక్తి కల్పిస్తామని రాష్ట్ర బిజెపి నాయకుడు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, బండి సంజయ్ కుమార్ చేపట్టిన నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనీ చిత్తారమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం రామ్ లీలా మైదానంలో సభ ప్రాంగణంలో పాల్గొన్నారు. అయితే సభలో బండి సంజయ్ కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. పోలీసులు, తెరాస గుండాలు అడ్డుకున్నా ప్రజా సంగ్రామ యాత్ర ఆగలేదన్నారు. అసోం సీఎంకు భద్రత కల్పించలేని దురవస్థ ఏర్పడిందని మండిపడ్డారు. ధర్మం కోసం, సమాజం కోసం భాజపా పోరాడుతోందని హితవు పలికారు.

నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర సభలో రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

అనంతరం కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. కేసీఆర్ కుటుంబానికి తప్ప తెలంగాణ ప్రజలకు వీసమెత్తు ప్రయోజనం దక్కలేదు. తెలంగాణ సాధించుకున్న ప్రయోజనాలు ప్రజలకు దక్కాలంటే బిజెపి అధికారంలోకి రావాల్సిందే. రాష్ట్రం లో నిరంకుశ పాలన అంతమవ్వాలని చిత్తారమ్మ దేవాలయం వేడుకున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ అవినీతి, కుటుంబ, నియంతృత్వ పాలన నుంచి తెలంగాణ విముక్తికై చేపడుతున్న ఈ యాత్ర దిగ్విజయం కావాలని కోరుకుంటూ చిత్తారమ్మ వారి ఆశీర్వాదం తీసుకొని యాత్ర ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ కంచర్ల ఎల్లేష్ గారు,రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ కిసాన్ మోర్చా అధ్యక్షులు కిషన్ గౌలి, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి,సీనియర్ నాయకులు,కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here