శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనీ పలు డివిజన్లలో ఏర్పాటుచేసిన గణనాథుడి మండపాలలో ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం చేపట్టిన అన్నదాన కార్యక్రమాలలో రాష్ట్ర బిజెపి నాయకులు ఎం. రవి కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
అనంతరం రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ విఘ్నేశ్వరుడి కరుణాకటాక్షాలు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని, నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని గణనాథుడిని కోరుకున్నట్లు తెలిపారు.