నమస్తే శేరిలింగంపల్లి: దశల వారిగా దళిత బంధు పథకం పూర్తి స్థాయిలో అమలు అవుతుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో భాగంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిక్ నగర్ కాలనీ కి చెందిన వినయ్ కుమార్ కు మంజూరైన స్విఫ్ట్ డిజైర్ కార్ ను ఆయన లబ్దిదారుడికి అందజేశారు.
అనంతరం విప్ గాంధీ మాట్లాడుతూ ఈ ఏడాది 2000 మంది లబ్ధిదారులకు అవకాశం కలిపిస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధావుడు అని ,దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. లబ్ధిదారులను శాలువాతో సత్కరించారు. లబ్ధిదారులను గుర్తించి వారి కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కలిపించేలా సహకరించాలని కోరారు. పథకం అమలులో కార్యచరణ, పర్యవేక్షణ ఉండేలా చూడాలని ఆదికారులను ఆదేశించారు. దళిత బంధు పథకం అమలు లో లబ్ధిదారులకు సలహాలు ,సూచనలు ఇచ్చామని, అధికారుల సహకారం తో ముందుకు వెళ్లాలని చెప్పారు. అధికారులు ఎల్లవేలలో అందుబాటులో ఉంటార తెలిపారు. దళిత బంధు పథకంతో కారుకు యాజమాని అయిన సందర్భంగా సందర్భంగా స్వీట్లు పంచుతూ, హర్షం వ్యక్తం చేశాడు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రివర్యులు కేటీఆర్ , ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజు, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, తెరాస నాయకులు ఉరిటీ వెంకట్రావు, అబీబ్ బాయ్, తిరుపతి రెడ్డి, బ్రిక్ శ్రీనివాస్, గుమ్మడి శ్రీనివాస్ , గిరి పాల్గొన్నారు