నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గంలో బాబు జగ్జీవన్ రామ్ యువజన సంఘం ఆధ్వర్యంలోని వినాయకుని మండపoలో శనివారం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ విఘ్నేశ్వరుని కరుణా, కటాక్షం ప్రజలపై తప్పక ఉంటుందన్నారు. విఘ్నేశ్వరునికి ఆశీస్సులతో ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మూల అనిల్ గౌడ్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి దయాకర్ , సీనియర్ సంజీవ, శంలేట్ నందు, దుర్గారామ్, రంగస్వామి ముదిరాజ్, విష్ణు, టీంకు, నర్సింగ్ రావు, శివ నాయకులు, గణేష్ కమిటీ సభ్యులు, స్థానిక నేతలు, భక్తులు, బస్తీ వాసులు , కార్యకర్తలు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు