దేశానికే ఆదర్శంగా దళితబంధు

లబ్ధిదారుడికి స్విఫ్ట్ డిజైర్ అందజేసిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో భాగంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి వికర్ సెక్షన్ కి చెందిన రవీందర్ కు స్విఫ్ట్ డిజైర్ కార్ మంజూరవగా.. ఆ కారును మాజీ కార్పొరేటర్ శ్రీ సాయి బాబాతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ గారు మాట్లాడుతూ దశల వారిగా దళిత బంధు పథకం పూర్తి స్థాయిలో అమలు అవుతుందని , ఈ యేడాది 2000 మంది లబ్ధిదారులకు అవకాశం కలిపిస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బాంధవుడు అని ,దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. దళితులలో ద్విగుణీకృత మార్పు తీసుకురావడానికి సీఎం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం అమలు లో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారుల ఎంపికపై శేరిలింగంపల్లి నియోజవర్గంలో పథకం విధి విధానాల పై అవగాహన కార్యక్రమం గతంలో నిర్వహించామని, ఈ రోజు ఎంపికైన లబ్ధిదారులకు మంజూరైన వాహనాలను అందించడం చాలా సంతోషకరమైన విషయమన్నారు.

దళిత బంధు పథకం కింద స్విఫ్ట్ డిజైర్ ను లబ్ధిదారుడికి అందజేస్తున్న ప్రభుత్వ అరేక పూడి గాంధీ

ఈ సందర్భంగా లబ్ధిదారులను సత్కరించారు. వారు ఎన్నుకున్న రంగాలలో మరింత ఉన్నతి సాధించాలని వారి కుటుంబాలలో వెలుగులు నిండాలని ఆశిస్తున్నానని విప్ గాంధీ ఆకాంక్షించారు. దళిత బంధు పథకం ద్వారా దళిత కుటుంబాలలో ఆర్థిక , సామాజిక అసమానతలు రూపు మాపి వారి జీవితాలలో కొత్త వెలుగులు నింపిన వారవుతామని, వారి కాలి పై వారు సగర్వంగా తలెత్తుకొని జీవించేలా ఆర్థిక పరిపుష్టి కలిగేలా ఈ పథకం తోడ్పడుతుందని అన్నారు. దళిత కుటుంబాల సంక్షేమానికి కట్టుబడిన దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని , ఈ 100 మంది లబ్ధిదారులు భవిష్యత్తులో మిగతా వారికి ఆదర్శంగా నిలిచేలా ఉండాలని చెప్పారు. పక్కా ప్రణాళిక తో యూనిట్లను నెలకొల్పి భావి తరాలకు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. లబ్ధిదారులను గుర్తించి వారి కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కలిపించే విధంగా సహకరించాలని కోరారు. అదేవిధంగా వ్యాపార యూనిట్లను వివరించామని ,వారికి నచ్చిన యూనిట్లు నెలకొల్పి ఆర్థిక ,సామాజిక సాధికారికత సాధించాలని, ప్రభుత్వ విప్ గాంధీ వివరించారు. పూర్తి స్థాయిలో పథకం అమలు పర్చేవిధంగా కార్యచరణ, పర్యవేక్షణ ఉండేలా చూడాలని ఆదికారులకు ఆదేశించారు. దళిత బంధు పథకం అమలులో లబ్ధిదారులకు సలహాలు, సూచనలు ఇచ్చామని, అధికారుల సహకారంతో ముందుకు వెళ్లాలని, అధికారులు ఎల్లవేలలో అందుబాటులో ఉంటారని , దశల వారిగా దళిత బంధు పథకం పూర్తి స్థాయిలో అమలు అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా దళిత బంధు పథకం కింద కారును పొందిన లబ్ధిదారులు మాట్లాడారు. దినసరి కూలి నుండి కార్ ఓనర్ గా మార్చిన సందర్భంగా స్వీట్లు పంచుతూ, హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రివర్యులు కేటీఆర్ , ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు తెరాస నాయకులు సురేందర్, విష్ణువర్ధన్ రెడ్డి, రమేష్, అనిల్, రాజేందర్, జితేందర్, విజయ్ పాల్గొన్నారు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here