నమస్తే శేరిలింగంపల్లి: శిల్పారామం మాదాపూర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ” ఆల్ ఇండియా శారీ మేళ” ఆకట్టుకుంటున్న ది. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా సెప్టెంబర్ 20 వరకు మాదాపూర్ శిల్పారామం ఆవరణలో నిర్వహించనున్నారు. అంతేకాక వివిధ రాష్ట్రాల నుండి ప్రశస్తమైన చేనేత చీరలను సందర్శకుల కోసం ఏర్పాటు చేశారు. ఈ మేళాలో దాదాపుగా 65 స్టాల్ల్స్ నూతనంగా ఏర్పాటు చేసారు. రాజస్థాన్ నుండి కోట, జైపూర్ కాటన్ చీరలు. బీహార్ నుండి టుస్సార్, భాగల్పూరి చీరలు, ఆంధ్రప్రదేశ్ నుండి చీరాల , కలంకారీ, వేంకటగిరి, ఉప్పాడ, పేటేరు, మంగళగిరి, చీరలు, తెలంగాణ నుండి పోచంపల్లి, గద్వాల్, నారాయణపేట, గొల్లబామ చీరలు, మధ్యప్రదేశ్ నుండి బాతిక్ ప్రింట్ , చందేరి చీరలు, ఉత్తరప్రదేశ్ నుండి బనారసీ, వెస్ట్ బెంగాళ్ నుండి జాంధానీ, టస్సార్, బెంగాలీ కాటన్ , పెయింటెడ్ చీరలు, ఒరిస్సా నుండి ఇక్కత్ చీరలు, గుజరాత్ నుండి బ్లాక్ ప్రింటింగ్ , హ్యాండ్ ఎంబ్రాయిడరీ చీరలు, డ్రెస్ మెటీరియల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి రోజు సాయంత్రం యంపీ థియేటర్ లో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. శుక్రవారం డాక్టర్ వినీల రావు బృందం చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆధ్యాంతం అలరించింది. నర్తన గణపతి, భో శంభో, ప్రహ్లద పట్టాభిషేకం, కళింగ నర్తన తిల్లాన, వచ్చెను అలివేలు మంగ, అతి నిరుపమా సున్దరాకార, మహేశ్వరి మహాకాళి మొదలైన అంశాలను కళాకారులు ప్రదర్శించారు.