నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ నాభిశిల ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొని నాభిశిల (బొడ్డు రాయి) కి ప్రత్యేక పూజలు చేసి ప్రతిష్టాపన చేశారు. గ్రామానికి బొడ్డు రాయి ఎంతో శ్రేష్టమని, బొడ్డు రాయికి ఎంతో మహిమ ఉంటుందని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, టీఆర్ఎస్ నాయకులు నరేష్, సంపత్ కుమార్, సతీష్, రాములు గౌడ్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
