పోటీ పరీక్షలకు స్టడీ మెటీరియల్ ఎంతగానో ఉపయోగపడుతుంది – ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ కు నిరుద్యోగ యువత తీవ్ర స్థాయిలో సన్నద్ధమై ప్రభుత్వ ఉద్యోగాన్ని దక్కించుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ప్రకటన నేపథ్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో శిక్షణ పొందుతున్న నిరుపేద నిరుద్యోగ యువతీ యువకులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ స్టడీ మెటీరియల్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన స్వంత నిధులతో ఏర్పాటు చేసిన ఉచితంగా ఎస్ఐ, కాని స్టేబుల్, టీఎస్ పీఎస్సీ గ్రూపులు, తదితర పోటీ పరీక్షలకు సంబంధించి యువతకు ఉచిత శిక్షణ శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఉచిత మెటీరియల్  పరీక్షలు రాసే అభ్యర్థులకు ఉపయోగపడుతుందని అన్నారు. పట్టుదలతో మంచి క్రమశిక్షణతో చదివి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్ గాంధీ చేతుల మీదుగా స్టడీ మెటీరియల్ అందుకున్న యువత
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here