నమస్తే శేరిలింగంపల్లి: దివ్యాంగులు సమాజంలో గౌరవంగా బ్రతికేలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తుందని గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా అన్నారు. సాయిబాబా అందజేసిన ఆర్ధిక సహాయంతో రాయదుర్గం గ్రామంలో మేకల అశోక్ కుమార్ నూతనంగా ఏర్పాటు చేసుకున్న జిరాక్స్ సెంటర్ ను ప్రారంభించారు. అంగవైకల్యం ఉందని నిరుత్సాహపడకుండా ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవాలని సాయిబాబా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు శేరిలింగంపల్లి వికలాంగుల అధ్యక్షులు మేకల అశోక్ కుమార్ ముదిరాజ్, రమేష్ గౌడ్, శామ్లెట్ శ్రీనివాస్, లియాకత్ అలీ, ఇమ్రాన్, శివ, శ్రీను, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.