నమస్తే శేరిలింగంపల్లి: జీహెచ్ఎంసీ, ఆలింకో సంస్థ వారు దివ్యాంగుల కోసం ఉచితంగా ఉపకరణాలను పంపిణీ చేయడం సంతోషకరమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ, ఆలింకో సంస్థ సమన్వయంతో శేరిలింగంపల్లి జోనల్ ఆఫీస్ మీటింగ్ హాల్ లో నిర్వహించిన బీపీఎల్ పరిధిలోని దివ్యాంగులకు, వయో వృద్ధులకు ఉచిత ఉపకరణాలను, కృత్రిమ అవయవాలను, సహాయ పరికరాల ఎంపిక గుర్తింపు శిబిరాన్ని జోనల్ కమిషనర్ శంకరయ్య, డీసీ వెంకన్న, కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, సింధు ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయి బాబాతో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగుల కోసం ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. ఆసరా ఫించన్, ఉచిత సహాయ పరికరాలు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన గుర్తింపు శిబిరాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జులై ఒకటో తేదీన చందానగర్ లోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ మున్సిపల్ కళ్యాణ మండపంలో, 7 వ తేదీన హైదర్ నగర్ లోని హెచ్ఎంటీ హిల్స్ కమ్యూనిటీ హాల్ లో గుర్తింపు శిబిరాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. శిబిరానికి హాజరయ్యే వారు సదరం సర్టిఫికెట్, ఆదాయం సర్టిఫికెట్ లేదా రేషన్ కార్డు, అంగవైకల్యానికి సంబంధించిన పాస్ పోర్ట్ సైజ్ గల 2 ఫోటోలు, ఆధార్ కార్డ్, సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డు, రెండు పాస్ పోర్ట్ సైజ్ రెండు ఫోటోలతో హాజరుకావాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ మన్వి, ఏఎంఓహెచ్ నగేష్, శానిటేషన్ సూపర్ వైజర్ జలందర్, మాజీ కౌన్సిలర్ వీరేశం గౌడ్, మాజీ కార్పొరేటర్ రవీందర్ ముదిరాజ్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు చింతకింది రవీందర్, పొడుగు రాంబాబు, కృష్ణ యాదవ్, నరేష్ ముదిరాజ్, వినయ్ , గోపాల్ యాదవ్, రాంచందర్, బసవరాజు, మహిళ నాయకులు వాణి, రూపరెడ్డి, శ్రీ కళ, అరుణ కుమారి, సౌజన్య, భాగ్య, కుమారి తదితరులు పాల్గొన్నారు.