నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రంలో బిజెపి జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, అధికార ప్రతినిధి బైజయంత్ జైపాండా అన్నారు. చందానగర్ క్రిస్టల్ గార్డెన్స్ లో జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ అధ్వర్యంలో శేరిలింగంపల్లి అసెంబ్లీ బిజెపి సంపర్క్ అభియాన్ నిర్వహించారు. జాతీయ ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధి బైజయంత్ జై పాండా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సారి జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతున్నందుకు చాలా సంతోషం అన్నారు. రాష్ట్రం లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపి బిజెపి జెండా ఎగురవేయాలనే లక్ష్యంగా కేంద్రం తెలంగాణ పై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. అందుకు అనుగుణంగా పావులు కదుపుతోందని, తెలంగాణలో బిజెపి అనూహ్య రీతిలో పుంజుకుందని, ప్రతి ఒక్క బిజెపి కార్యకర్త కష్టపడి బూత్ స్థాయిలో పని చేసేందుకు ఇది అనువైన సమయం అన్నారు. శక్తి కేంద్ర ఇంఛార్జీలు, బూత్ అధ్యక్షులు, పన్నా ప్రముఖ్ లు బీజేపీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అసెంబ్లీ పరిధిలోని అన్ని మోర్చాల కమిటీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ సంపర్క్ అభియాన్ ఇంఛార్జి గోనె శ్యామ్ సుందర్, జిల్లా సంఘటన మంత్రి శివ, రాష్ట్ర నాయకులు గజ్జల యోగానంద్, మొవ్వ సత్యనారాయణ, డా. నరేష్, రవి కుమార్ యాదవ్, ప్రభాకర్ యాదవ్, కాంచన కృష్ణ, వినయమ్మ, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి, జిల్లా, అసెంబ్లీ, డివిజన్ నాయకులు, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇంఛార్జిలు, వివిధ మోర్చాల నాయకులు పాల్గొన్నారు.