ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కరువు – బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు కరువై అధ్వాన్న స్థితిలో ఉన్నాయని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన పథకం తీరు ఎలా ఉందని విద్యార్థులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్ లేక విద్యార్థులు, టీచర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

పాపిరెడ్డి కాలనీ ప్రభుత్వ పాఠశాలలో మద్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్

మధ్యాహ్న భోజన పథకం అంతంత మాత్రంగానే ఉందని, విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరని తెలిపారు. సీఎం కేసీఆర్ పంజాబ్ కి రైతులకు మూడు లక్షలు ఇచ్చే బదులు ఇక్కడి ప్రభుత్వ బడులకు ఇస్తే బాగుండేదని దుయ్యబట్టారు. విద్యావ్యవస్థను బ్రష్టు పట్టించిన ఘన చరిత్ర కేసీఆర్ కే దక్కిందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించారని, ప్రస్తుత ఎమ్మెల్యే ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకునే పాపాన పోలేదన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్ల కాంటెస్టెడ్ కార్పొరేటర్ ఏల్లేష్ , మాదాపూర్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ రాధా కృష్ణ యాదవ్, నాయకులు రమేష్, విజయ్ యాదవ్, ఆనంద్, ఇమ్రాన్, రాజేష్, నరేష్, భద్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో వసతులపై ఆరా తీస్తున్న బిజెపి నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here