నమస్తే శేరిలింగంపల్లి: హైదరాబాద్ లోని మాదాపూర్ హెచ్ ఐ సీ సీ నోవాటెల్ లో జూలై ఒకటో తేదీ నుంచి జరగనున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాట్లను బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ పరిశీలించారు. జూలై మొదటి వారంలో నిర్వహించనున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, తదితరులు ఈ సమావేశంలో పాల్గొననున్న దృష్ట్యా అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు. సభా వేదిక ప్రాంగణాన్ని, వసతుల ఏర్పాట్లను, పరేడ్ గ్రౌండ్స్ లో జరగబోయే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను బిజెపి జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్, జాతీయ ఉపాధ్యక్షులు డి.కె. అరుణ, జాతీయ సంస్థాగత సహా కార్యదర్శి శివ ప్రకాశ్, తెలంగాణా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ మంత్రి శ్రీనివాస్, బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు, రాష్ట్ర, జిల్లా పధాధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించినట్లు చెప్పారు.