ఎండీఎస్ విద్యా సంస్థల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం

నమస్తే శేరిలింగంపల్లి: శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండేందుకు యోగా అభ్యసన దోహదపడుతుందని మహిళా‌ దక్షత సమితి విద్యా సంస్థల అధ్యక్షురాలు డాక్టర్ సరోజ్ బజాజ్ సూచించారు. మహిళా దక్షత సమితి, అనుబంధ విద్యాసంస్థలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాయి. సుమన్ బాలికల జూనియర్ కళాశాల, మహిళ డిగ్రీ కళాశాల, బన్సీలాల్ మలానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కళాశాల విద్యార్థినీలు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాభ్యసన చేశారు. యోగా టీచర్, ఎవాల్యుయేటర్ విజయ మాలతి పతంజలి యోగపీఠ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులతో యోగ ఆసనాలు చేయించారు. మెరుగైన ఆరోగ్యం కోసం యోగ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

మహిళ దక్షత సమితి విద్యా సంస్థల్లో జ్యోతి ప్రజ్వలన చేసి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రారంభిస్తున్న దృశ్యం

ఎండీఎస్ విద్యాసంస్థల అధ్యక్షురాలు డాక్టర్ సరోజ్ బజాజ్ విద్యార్థులకు వాయిస్ మెసేజ్ ద్వారా యోగా ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులకు యోగా ఎంతో అవసరమని, తద్వారా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంపొందుతుందని ఆమె అన్నారు. విజయ మాలతి మాట్లాడుతూ యోగా అనేది ఒక క్రమశిక్షణ అని, వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చని అన్నారు. ఎండీఎస్‌ విద్యాసంస్థల విద్యార్థులకు ఉచితంగా యోగా తరగతులు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. యోగాతో అనేక వ్యాధులను నయం చేయవచ్చని, అలాగే నివారించవచ్చని ఆమె అన్నారు. యోగా ఒత్తిడిని తగ్గిస్తుంది, మెదడును ఉత్తేజపరుస్తుంది, నిద్రను నిర్ధారించి, కండరాలను బలపరుస్తుందన్నారు. రక్తపోటును నియంత్రిస్తుందని, ఆందోళన, నిరాశను తగ్గిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎండీఎస్ అండ్ బీఎం కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రొఫెసర్ వెరోనికా, సుమన్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డి. రమా కుమారి, ఎండీఎస్ అండ్ బన్సీలాల్ మలానీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపాల్ హెచ్ సుశీల, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


యోగాభ్యసనలో ఎండీఎస్ విద్యాసంస్థల విద్యార్థులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here