నమస్తే శేరిలింగంపల్లి: పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, జూన్ 18వ తేదీ వరకు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా బస్తీలలో, కాలనీలలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రణాళికలు సిద్ధం చేసి పనులు చేపట్టేలా ముందుకు సాగాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్ పేట్ గ్రామం, సాయి నగర్, యూత్ కాలనీలలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్లు పూజిత గౌడ్, జగదీశ్వర్ గౌడ్, జోనల్ కమీషనర్ శంకరయ్య, డిప్యూటీ కమిషనర్ సుదాంషు, సీఈ ఎంటొమాలజిస్ట్ రాంబాబు, సీనియర్ ఎంటొమోలోజిస్ట్ మల్లయ్య, హెల్త్ ఆఫీసర్ కార్తిక్, ఈఈ శ్రీకాంతి, డీఈ సురేష్, వాటర్ వర్క్స్ డీజీఎం నాగప్రియ,మేనేజర్ మానస, టౌన్ ప్లానింగ్ ఏసీపీ సంపత్ కుమార్, టీపీఎస్ రవీందర్, ఏఈ ప్రతాప్, ఎలక్ట్రికల్ డీఈ సునీల్, ఏఈ రామ్మోహన్, యుబిడి చంద్రకాంత్, శానిటేషన్ ఎస్ఎస్ శ్రీనివాస్, ఎస్ ఆర్ పి మహేష్, ప్రసాద్, ఎంటోమొలోజీ సిబ్బంది, బస్తి వాసులతో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పర్యటించారు.
కాలనీలలోని చెత్తను తొలగించడం, డ్రైనేజీ వ్యవస్థను శుభ్రపరచడం, మురికి నీటి గుంతలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా చేయటమే లక్ష్యంగా ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నల్లా సంజీవ రెడ్డి, బాలింగ్ యాదగిరి గౌడ్, టీఆర్ఎస్ హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, టిఆర్ఎస్ హాఫీజ్ పెట్ డివిజన్ ఉపాధ్యక్షులు జామీర్, డివిజన్ నాయకులు కనకమామిడి నరేందర్ గౌడ్, లక్ష్మా రెడ్డి, వార్డు సభ్యులు కనక మామిడి వెంకటేష్ గౌడ్, నాయకులు శేఖర్ గౌడ్, సుదర్శన్, రామకృష్ణ గౌడ్, మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ సాదిక్, బాబు గౌడ్, ప్రభు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, సంజు సాగర్, చాంద్ పాషా, కమోజి, సాబేర్ హుస్సేన్, ఉమామహేశ్వర రావు, మల్లికార్జున్, ముజీబ్, పాషా, శ్రీకాంత్ ముదిరాజ్, మహిళలు షేబనా, ఆశ, కట్టున్ బీ, పర్వీన్, శ్రీలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.