శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ శిబిరం – ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ నోటిఫికేషన్ కు సన్నద్దమయ్యే నిరుద్యోగ యువతకు పేదరికం అడ్డుకాకూడదనే ఉద్దేశంతో తన స్వంత నిధులతో శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. నిరుపేద నిరుద్యోగ యువతీ యువకులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో తన స్వంత నిధులతో ఏర్పాటు చేసిన ఎస్ఐ, కానిస్టేబుల్, టీఎస్ పీఎస్ సీ, గ్రూప్స్ కు, ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి ఉచిత శిక్షణ శిబిరం తరగతులను మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, రోజాదేవి రంగారావు, మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ ను అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ ప్రకటన నేపథ్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నిరుపేద నిరుద్యోగ యువతీ యువకులకు స్వంత నిధులతో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో నిరుద్యోగ యువతను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసి తర్ఫీదు ఇచ్చి పరీక్షలకు సిద్ధం చేయడమే లక్ష్యం అన్నారు.

ఉచిత శిక్షణ శిబిరం ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ గాంధీ

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పేద విద్యార్థులకు ఈ ఉచిత శిక్షణ శిబిరం ఎంతగానో తోడ్పడుతుందని చెప్పారు. అర్హులైన ప్రతి యువతీ యువకులకు, రాత పరీక్షలో ఎంపికైన వారికి ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. వీటితో పాటు శారీరక దారుఢ్య పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహిస్తామన్నారు. నైపుణ్యం గల నిపుణులచే శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, ఐపీఎస్ అధికారి తో గెస్ట్ లెక్చరర్ గా బోధన ఉంటుందని, ఉద్యోగ అర్హత పరీక్షలకు అర్హత సాధించి ఉద్యోగం సాధించేలా యువకులు పట్టుదలతో, సరైన క్రమ శిక్షణ తో నిరంతరం పట్టుదలతో చదివి ఉద్యోగం సాధించాలని ప్రభుత్వ విప్ గాంధీ అన్నారు. ఈ కార్యక్రమం లో పినాకిల్ విద్యా సంస్థల ఛైర్మెన్ శ్రీదేవి, సైన్ సంస్థ నిర్వాహకులు విజయ్, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

శిక్షణ శిబిరంలో పాల్గొన్న నిరుద్యోగ యువత
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here