నమస్తే శేరిలింగంపల్లి: యోగా సాధన చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని, ప్రజలందరూ యోగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి అన్నారు. సైంటిఫిక్ సెయింట్ శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి దివ్య ఆశీస్సులతో స్ఫూర్తి కుటుంబం ట్రస్ట్ ఆధ్యాత్మిక సంస్థ ఆధ్వర్యంలో చందానగర్ డివిజన్ పరిధిలోని భవానిపురం కాలనీలో స్ఫూర్తి సత్సంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గురువు విశిష్టత, ప్రస్థాన ధ్యానం, యోగ ప్రాణాయామం ధ్యానం పైన అవగాహన కల్పించి మూడు రోజుల శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ యోగా సాధనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి కుటుంబ సభ్యులు, భవానిపురం కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.