నమస్తే శేరిలింగంపల్లి: తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, నటరత్న మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రాజకీయాల్లో పెనుమార్పులు సృష్టించిన వ్యక్తిగా చిరస్థాయి వరకు నిలిచిపోతారని టీవీ5 మూర్తి అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను తెలంగాణ కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో మియాపూర్ ప్రగతి ఎంక్లేవ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు కుల మతాలకతీతంగా పెద్ద ఎత్తున పాల్గొని నివాళి అర్పించారు. ముఖ్యఅతిథిగా టీవీ5 మూర్తి పాల్గొని ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. తెలంగాణ కమ్మ సేవా సమితి సమితి అధ్యక్షులు మొవ్వ సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సామాన్యులకు సైతం రాజకీయాల్లో పదవులు పొందే అవకాశం లభించిందన్నారు. బడుగు బలహీన వర్గాలకు, సామాన్యులకు ఎన్టీఆర్ వచ్చిన తర్వాత న్యాయం చేకూరిందని అన్నారు.
భారతీయ జనతాపార్టీ జాతీయ మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు వీరపనేని పద్మ, బిజెపి మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి వడ్లమూడి సులోచన, అమీర్ పేట కార్పొరేటర్ కేతినేని సరళ, రాష్ట్ర కమ్మ సేవా సమితి ఉపాధ్యక్షులు సాయిబాబు చౌదరి, వినోద్ చౌదరి, ప్రధాన కార్యదర్శి రాఘవేంద్రరావు, బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ నరేష్ రంగారెడ్డి, అర్బన్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు డి ఎస్ ఆర్ కే ప్రసాద్, మియాపూర్ కమ్మ సంఘం అధ్యక్షులు గోపీచంద్, ఉపాధ్యక్షులు లీలా ప్రసాద్, నాయకులు సత్యనారాయణ, చౌదరి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జెపి నగర్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.