సమన్వయంతో పనిచేసి అభివృద్ధికి సహకరించండి – సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, రాబోయే వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నాలాల విస్తరణ, చెరువుల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపర్చేలా ఎప్పటికప్పుడు కృషి చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు.మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి పనులపై జోనల్ కమిషనర్ శంకరయ్య, డీసీ వెంకన్న, కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి, జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం, జలమండలి ఇరిగేషన్, ఎస్ ఎన్ డీ పీ, హెవ్ఎండీఏ, రెవెన్యూ, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్, స్ట్రీట్ లైట్స్ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కోసం అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గాంధీ

ఎస్టీపీలకు అనుసంధానం చేసే ఔట్ లెట్ ల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, చందానగర్ రెడ్డి కాలనీలోని ఎస్టీపీ వద్ద ఏర్పాటు చేయాల్సిన ఔట్ లెట్ అడ్డంకులను వెంటనే తొలగించి పనులు జరిగేలా చూడాలని సూచించారు. రెవెన్యూ, జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్ విభాగాల అధికారులు సహకరించి 700 రన్నింగ్ మీటర్స్ పైప్ లైన్ నిర్మాణానికి చొరవ తీసుకోవాలని, బక్షికుంట చెరువు వద్ద డ్రైనేజీ అవుడ్ లెట్ నిర్మించి డ్రైనేజీ నీటిని మళ్లించాలని, మాదాపూర్ దుర్గం చెరువు వెళ్లే దారిలో ఫార్చూన్ టవర్స్ వద్ద నీరు నిల్వకుండా పైప్ లైన్ ఏర్పాటు చేయడానికి ఇంజనీరింగ్, జలమండలి, అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలన్నారు. రోడ్ కట్టింగ్ సమయంలో మంచి నీటి పైప్ లైన్, డ్రైనేజీ పైప్ లైన్ వేసేటప్పుడు తవ్విన రోడ్లను వెంటనే మరమత్తులు చేయాలని, యూజీడీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నాలాల వద్ద, మ్యాన్ హోల్స్ పై కప్పులు ఉండేలా చూడాలన్నారు. ఇంటి నిర్మాణ వ్యర్థాలు, బండరాళ్లు, మట్టి కుప్పలు, రోడ్డు పక్కన వేయకుండా చూడాలని, ముఖ్యంగా రాత్రి సమయంలో ఖాళీ స్థలాల్లో డంపింగ్ చేయడాన్ని నిరోధించాలని ప్రభుత్వ విప్ గాంధీ సూచించారు. మంచి నీటి వ్యవస్థను సరిగ్గా నిర్వహించాలని, గంగారాం, పటేల్, కైదమ్మ కుంట, ఈర్ల చెరువు ప్రస్తుతం ప్రారంభించిన ఆరు చెరువుల అభివృద్ధి, ఇతర చెరువుల సుందరీకరణ పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. రోడ్ల పనులలో వేగం పెంచాలని, ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతి పై సమీక్షా జరపడం జరిగిందన్నారు. అసంపూర్తిగా మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, కొత్త ప్రతిపాదనలు తీసుకురావాలని, వీది దీపాల నిర్వహణ పై వస్తున్న ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. స్మశాన వాటికల అభివృద్ధి పనులు మందకొండిగా ఉన్నాయని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పనులలో వేగం పెంచాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం జూన్ 3 నుండి ప్రారంభమవుతుందని శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిల్ లో 27 బృందాలు పనిచేస్తాయని, ఒక్కొక్క బృందానికి ఐదుగురు సభ్యులు విధులు నిర్వహిస్తారని, ప్రతి బృందానికి ఒక లారీ, టిప్పర్ తో పనులు చేస్తారని చెప్పారు. ప్రతి కాలనీలో జూన్ 18 వ తేదీ వరకు పట్టణ ప్రగతి కార్యక్రమం జరుగనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వంశీ మోహన్ ఆర్ఐలు శ్రీకాంత్ , శ్రీనివాస్, ఎస్ఈ శంకర్ నాయక్, ఈఈలు శ్రీనివాస్, శ్రీకాంతిని, డీఈలు సురేష్, రమేష్, స్రవంతి, ఏఈలు సునీల్, ప్రశాంత్, శివ ప్రసాద్, కృష్ణ వేణు, ప్రతాప్, జగదీష్, ఏఎంఓహెచ్ కార్తిక్, జలమండలి జీఎం రాజశేఖర్, డీజీఎం నాగప్రియ, మేనేజర్లు సుబ్రమణ్యం, యాదయ్య, సందీప్, నరేందర్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, సాయి చరిత, సునీత, మానస, ఎస్టీపీ విభాగం అధికారులు పద్మజ, వసంత కుమారి, కుమార్, ఇరిగేషన్ ఈఈ నారాయణ, డీఈలు నళిని, శేషగిరి, ఏఈలు పావని, మహేందర్, టౌన్ ప్లానింగ్ డిప్యూటీ సిటీ ప్లానర్ గణపతి, ఏసీపీ మెహ్రా, సంపత్, టీపీఎస్ లు రవీందర్, రమేష్, స్ట్రీట్ లైట్స్ ఈఈ ఇంద్రదీప్, డీఈ సునీల్, ఏఈ రామ్మోహన్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here