నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన రెండవ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేయనున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమీత్ షా కు స్వాగతం పలకేందుకు తుక్కుగూడ లో ఈ నెల 14 న ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ సూచించారు. ఈ మేరకు మసీద్ బండ లోని బిజెపి కార్యాలయంలో జనసమీకరణ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రజా గోస కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి అమీత్ షా హాజరుకానున్నట్లు తెలిపారు. తుక్కు గూడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి ఆయా డివిజన్ల అధ్యక్షులు, మహిళా మోర్చా అధ్యక్షులు, బిజెవైఎం కార్యకర్తలు, ఎస్టీ, ఎస్సీ మోర్చా, శక్తి కేంద్రాల ఇంచార్జీ లు వివిధ పదాధికారులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. మసీదు బండ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున తుక్కుగూడ భారీ బహిరంగ సభకు బయలుదేరాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్ గౌడ్, గంగాధర్ రెడ్డి, ఎల్లేష్, రాధాకృష్ణ యాదవ్, కసిరెడ్డి రఘునాథరెడ్డి, ఆంజనేయులు సాగర్, రాజు శెట్టి, రమేష్, మహిపాల్ రెడ్డి, భరత్, గణేష్, అర్జున్, వినోద్, పద్మ, మేరీ, రేఖ, వినీత సింగ్, రేణుక, వరలక్ష్మి, ఇందిరా తదితరులు పాల్గొన్నారు.