బిజెపి పట్ల ఆకర్షితులై పార్టీలోకి సాప్ట్ వేర్ ఉద్యోగుల చేరిక – కండువా కప్పి ఆహ్వానించిన రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం, దేశ ప్రజల కోసం చేపట్టిన పథకాలకు ఆకర్షితులై అన్ని వర్గాల ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని పలువురు సాప్ట్ వేర్ ఉద్యోగులు రామరాజు అధ్వర్యంలో బిజెపిలో చేరారు. బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

సాప్ట్ వేర్ ఉద్యోగులతో మాట్లాడుతున్న బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్

ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో వేల మంది ఐటీ ఉద్యోగులు జీవిస్తున్నారని, సామాజిక సేవల్లో ముందుకు వస్తున్న సాప్ట్ వేర్ ఉద్యోగులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల ఐటీ ఉద్యోగులు ఆకర్షితులై బిజెపి లోకి చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే నియోజకవర్గానికి, ఐటీ ఉద్యోగులకు ఒరగబెట్టిందేమి లేదని ఎద్దేవా చేశారు. ఐటీ మంత్రి కేటీఆర్ విశ్వనగరంగా ఉన్న ఈ నగరాన్ని విషాద నగరంలోకి మార్చి గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిలో వెనక్కి నెట్టారని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం‌ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బిజెపిలో చేరిన వారిలో సాప్ట్ వేర్ ఉద్యోగులు కేశవ్, ప్రవీణ్, రాజా, సత్యప్రసాద్, జగదీష్, రాము, నాగేంద్ర, రామరాజు, సత్యకీర్తి తో పాటు పలువురు చేరగా కార్యక్రమంలో నాయకులు సీతారామరాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

బిజెపిలోకి చేరిన సాప్ట్ వేర్ ఉద్యోగులకు కండువా కప్పి ఆహ్వానిస్తున్న‌ రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here