నమస్తే శేరిలింగంపల్లి: బిజెవైఎం భారత్ సందర్శనలో చందానగర్ నుంచి కసిరెడ్డి సింధు రఘునాథ్ రెడ్డి భాగస్వామ్యం అయ్యారు. బిజెవైఎం భారత సందర్శన కార్యక్రమంలో పాల్గొనాలని బిజెవైఎం జాతీయ నాయకత్వం ఇచ్చిన ఆహ్వానం మేరకు ఉత్తరాఖండ్ లో జరిగిన బిజెవైఎం సుశాసన్ యాత్రలో కసిరెడ్డి సింధు రెడ్డి 12 రాష్ట్రాల బిజెవైఎం ప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. డెహ్రాడూన్, హరిద్వార్, ఉత్తరకాశి ప్రాంతాలలో జాతీయ బిజెవైఎం నాయకులతో కలిసి పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తలపెట్టిన పథకాలను, అభివృద్ధి పనులను వివరించారు. హరిద్వార్ లోని పతంజలి ఫ్యాక్టరీని సందర్శించి సీఈఓ ఆచార్య బాలకిషన్ ను కలిశారు. ఈ అవకాశాన్ని కల్పించిన జాతీయ నాయకులు తేజస్వి సూర్య, అభినవ్ ప్రకాష్, నేహా జోషి, సాయి ప్రసాద్ కు ధన్యవాదాలు తెలిపారు.