పేద ముస్లింలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో కులమతాలకు అతీతంగా రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ పండగలకు కొత్త బట్టలను కానుకగా ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ‌ఆరెకపూడి గాంధీ అన్నారు. రంజాన్ మాసం పర్వదినాన్ని పురస్కరించుకుని పేద ముస్లింలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిత్యావసర సరుకులను ప్రభుత్వ విప్ గాంధీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ముస్లిం మైనార్టీ సోదరులు రంజాన్ పండగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ప్రతి సంవత్సరం నూతన బట్టలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు నాయినేని చద్రకాంత్ రావు, గుమ్మడి శ్రీనివాస్, కార్తిక్ రావు, రఘునాథ్,‌ ఆంజనేయులు, శ్రావణి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ముస్లింలకు నిత్యావసర సరుకులను అందజేస్తున్న ప్రభుత్వ ‌విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here