నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తున్నామని, మౌలిక వసతులు కల్పించి అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం ప్రశాంత్ హిల్స్ కాలనీ రాక్ చర్చి, నానక్ రాం గూడ కాలనీలలో మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ప్రభుత్వ విప్ గాంధీ పాదయాత్ర చేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ప్రశాంతి హిల్స్, నానక్ రాంగూడ ఎస్సీ బస్తీ కాలనీలలో నెలకొన్న డ్రైనేజీ సమస్యతో పాటు అన్ని సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. డ్రైనేజీ, మంచి నీరు, రోడ్లు, వీధి దీపాలు, ఎలక్ట్రికల్ సంబందిత సమస్యలను, రోడ్డు విస్తరణ పనులను చేపట్టి ట్రాఫిక్ సమస్య ను పరిష్కరిస్తానని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీనివాస్, డీఈ రమేష్, ఏఈ కృష్ణ వేణి, టీపీఎస్ అధికారులు విశాల్, రమేష్, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు దర్గుపల్లీ నరేష్, రమేష్ గౌడ్, శ్రీనివాస్, సల్లా ఉద్దీన్, యువరాజ్, శ్రీకాంత్, అనిల్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.