మా బడి – మా చదువు మంచి సందేశాత్మక చిత్రం – భేరి ఫిలిం టీం సభ్యులకు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అభినందనలు

నమస్తే శేరిలింగంపల్లి: సమాజానికి ఉపయోగపడేలా సందేశాత్మక చిత్రాలని రూపొందించడం అభినందనీయమని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. భేరి ఫిలిం కార్పొరేషన్ సంస్థలో భేరి రామచందర్ యాదవ్ నిర్మించిన మా బడి – మా చదువు అనే లఘు చిత్రం శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ చేతుల మీదుగా కార్పొరేటర్ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ భేరి ఫిలిం కార్పొరేషన్ భేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో మంచి సందేశాత్మక చిత్రాలు నిర్మిస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లల ఉజ్వల భవిష్యత్తు ఉందని ప్రభుత్వం మన ఊరు – మన బడి అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ప్రభుత్వ స్కూళ్ల ప్రాముఖ్యతను బలోపేతం చేయాలని మంచి సందేశాత్మక చిత్రం తీసినందుకు భేరి ఫిలిం టీం సభ్యులను అభినందించారు. భేరి ఫిలిం కార్పొరేషన్ నిర్మాత భేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా సమాజానికి ఉపయోగపడే చిత్రాలు తీయాలని సంకల్పించామన్నారు. “మా బడి – మా చదువు” లఘు చిత్రంలో విద్యతో పాటు ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు నేర్పిస్తేనే విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని వివరించడం జరిగిందన్నారు. ఈ లఘు చిత్రం చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్ స్క్రైబ్ చేసి ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నేతాజీ నగర్ కాలనీ ఉపాధ్యక్షులు రాయుడు, భేరి శ్రీనివాస్ యాదవ్, భేరి చందు యాదవ్, నటీనటులు అనుపొజు సతీష్ సాయి, రాము, శ్రీశైలం యాదవ్ కొడకంచి, సృజిని, దర్శకుడు పెద్ద రాజుల మధు, ఎడిటర్ రంజిత్ కుమార్ రెడ్డి, తలారి పవన్,భువన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here