సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా – గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: కాలనీల్లో ‌నెలకొన్న సమస్యలను పరిష్కరించి మౌలిక వసతుల‌ కల్పనకు కృషి చేస్తామని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని మధురా నగర్ లో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు బస్తీబాట చేపట్టారు. కాలనీలో‌ నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ కాలనీలో డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధి దీపాల పనితీరుపై ఆరా తీశారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేలా పని చేస్తున్నామన్నారు. గచ్చిబౌలి డివిజన్ లోని ప్రతీ కాలనీ, బస్తీల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పనిచేస్తామని అన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా తమను సంప్రదించాలన్నారు.‌‌

మదురా నగర్ లో సమస్యలు తెలుసుకుంటున్న గచ్చిబౌలి ‌కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

అనంతరం రాయదుర్గం లోని శ్రీ శ్రీ శ్రీ కట్ట మైసమ్మ దేవాలయంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. గచ్చిబౌలి డివిజన్ లో ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ కృష్ణ వేణి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మూల అనిల్ గౌడ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, రంగారెడ్డి జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నరేందర్ ముదిరాజ్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్, తిరుపతి, గచ్చిబౌలి డివిజన్ ఐటీ సెల్ కన్వీనర్ రాఘవేంద్ర, మహిళా మోర్చా అధ్యక్షురాలు చిలుకూరి మహేశ్వరి, నాయకులు వరలక్ష్మి, ఇందిరా, అరుణ్ గౌడ్, రవి కుమార్, దుర్గ రామ్, కృష్ణ, మధుర నగర్ కాలనీ వాసులు, శేఖర్, రాణి, మమత, పద్మ, సునీత, సతీష్ గౌడ్, శ్రీనివాస్, సంజీవ్, శ్యామ్ యాదవ్, వినోద్ కుమార్, శివ కుమార్, శ్రీశైలం, మల్లేష్, మహేష్, చీతారి, అరుణ్ గౌడ్, అమర్ యాదవ్, దుర్గ రామ్, కృష్ణ, జీహెచ్ఎంసీ వర్క్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్, ఎలక్ట్రికల్ లైన్ మెన్ మహేష్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు‌.

రాయదుర్గం కట్టమైసమ్మ ఆలయంలో పూజలు చేస్తున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here