నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పేట్ డివిజన్ అభివృద్ధి కి శాయశక్తులా కృషి చేస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈర్ల చెరువు నుండి దీప్తి శ్రీ నగర్ నాలా వరకు రూ.15.88 కోట్ల అంచనా వ్యయం తో 2.4 కి.మీల మేర చేపడుతున్న నాల విస్తరణ పనులను రామకృష్ణ నగర్ లో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎస్ ఎన్ డీ పీ వ్యూహాత్మక నాలా అభివృద్ధిలో భాగంగా పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. దీంతో ముంపు సమస్య ఉండదని, ఎన్నో ఏండ్ల సమస్య తీరునుందని చెప్పారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నాలాల విస్తరణ పనులను వేగవంతం చేయాలని, నాలా విస్తరణ పై ప్రణాళికలు రూపొందించి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ప్రభుత్వ విప్ గాంధీ సూచించారు. అనంతరం గేజిటెడ్ ఆఫీసర్స్ కాలనీలో పర్యటించి కాలనీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
గేజిటెడ్ ఆఫీసర్స్ కాలనీలో నెలకొన్న పార్కుల అభివృద్ధి, రోడ్లు , డ్రైనేజీ తదితర సమస్యల పరిష్కరించడానికి కృషి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ చెప్పారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పెట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, గౌరవ అధ్యక్షుడు వాలా హరీష్ రావు , మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, గేజిటెడ్ ఆఫీసర్స్ కాలనీ వాసులు త్రినాద్, శాంతి కుమార్, ఫణి, హన్మంత రావు, శివరావు, సుబ్రహ్మణ్యం, శశిధర్, నాయకులు వెంకటేష్ గౌడ్, రామకృష్ణ నగర్ కాలనీ వాసులు విష్ణు వర్ధన్ రెడ్డి, ఉమా మహేశ్వర రావు, నాగేశ్వరరావు, సురేందర్, ప్రభాకర్, రసూల్, కృష్ణ, వెంకట్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.