నమస్తే శేరిలింగంపల్లి: పేదల కోసం నిరంతరం పోరాడిన అమరజీవి కామ్రెడ్ తాండ్ర కుమార్ లేని లోటు తీరనిదని ఎంసీపీఐయూ జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ అన్నారు. మియాపూర్ లోని కామ్రేడ్ తాండ్ర కుమార్ ఇంటి వద్ద కుటుంబ సభ్యులు దశదినకర్మ నిర్వహించారు. తాండ్ర కుమార్ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నగరంలోని పేదల కోసం తాండ్ర కుమార్ చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ఎంసీపీఐయూ జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్, రాష్ట్ర కార్యదర్శి గాధ గోని రవి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు వల్లెపు ఉపేందర్ రెడ్డి, వనం సుధాకర్, కుంభం సుకన్య, వసుకుల మట్టయ్య, వి. తుకారాం నాయక్, హంసా రెడ్డి, కుమారస్వామి, కన్నం వెంకన్న, టి అనిల్ కుమార్, ఎం రమేష్, పల్లె మురళి, రాగసుధ, వసుకుల సైదమ్మ, ఏ. పుష్ప, పి భాగ్యమ్మ, సుల్తానా, లావణ్య, లక్ష్మి, పి మధుసూదన్, దేవేందర్ నాగభూషణం, శంకర్, రంగస్వామి, నరసింహ, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇ స్కైలాబ్ బాబు, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, విజయ్ కుమార్, సీపీఐఎం రంగారెడ్డి జిల్లా నాయకులు శోభన్, కృష్ణ, మాణిక్యం, సిపిఐ నాయకులు రామకృష్ణ, లింగయ్య, మహేష్ తదితరులు కూడా పాల్గొన్నారు.