నమస్తే శేరిలింగంపల్లి: భారతీయ జనతా పార్టీ విధివిధానాలకు ఆకర్షితులై అన్ని వర్గాల వారు బిజెపికి మద్దతుగా నిలుస్తున్నారని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. బిజెపిని బలోపేతం చేయడానికి హైదర్ నగర్ డివిజన్ మిత్ర హిల్స్ నుంచి సాఫ్ట్ వేర్ రంగానికి చెందిన పలువురు యువకులు మసీదుబండ కొండాపూర్ లో బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్ ను కలిసి మద్దతు తెలిపారు. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడానికి, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రవి కుమార్ యాదవ్ నాయకత్వంలో పని చేయడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని తెలుపుతూ అతి త్వరలో 200 మందితో భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. కలిసిన వారిలో సీతారామరాజు, కృష్ణ ప్రభాకర్, నబీద్, రామరాజు, వెంకట్, తదితరులు ఉన్నారు.