నమస్తే శేరిలింగంపల్లి: రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నాలాల విస్తరణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అధికారులకు, కాంట్రాక్టర్ కు సూచించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తిశ్రీ నగర్ నాలా విస్తరణ లో భాగంగా సీబీఆర్ ఎస్టేట్స్ వద్ద అసంపూర్తిగా మిగిలిపోయిన నాలా విస్తరణ పనులను జీహెచ్ఎంసీ అధికారులు, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ నాలా విస్తరణ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. నాలా నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో రాజీ పడకూడదని చెప్పారు. నాలా నిర్మాణ పనుల పై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అధికారులు సమన్వయంతో పని చేసి పనులలో పురోగతి సాధించాలని ప్రభుత్వ విప్ గాంధీ సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఏఈ రమేష్, ఇన్‌స్పెక్టర్ జగన్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు కాశినాథ్ యాదవ్, వెంకట్, భారతి అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.