నమస్తే శేరిలింగంపల్లి : మియాపూర్ లోని న్యూ కాలనీ లో కరెంటు షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో ఇల్లు దగ్దమై రోడ్డున పడ్డ కుంటుంబానికి ఆర్ కె వై టీం సభ్యులు అండగా నిలిచారు. బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ ఆదేశాల మేరకు స్పందించిన ఆర్ కె వై టీం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. తాము అండగా నిలుస్తామంటూ బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గుండె గణేష్ ముదిరాజ్, ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, జాజెరావు శ్రీను, శ్రీను యాదవ్, జాజెరావు రాము, గంగారం మల్లేష్, పాపయ్య ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.