నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడంతో విసిగిపోయిన యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తున్నారని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి తండా లో గల రంగనాథ్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన సురబి వాటర్ ప్లాంట్ ను గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి. గంగాధర్ రెడ్డి రాష్ట్ర బిజెవైఎం కోశాధికారి రఘునాథ్ యాదవ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువత నిరుత్సాహ పడకుండా స్వయం ఉపాధి పొంది ఆదర్శంగా నిలవాలని సూచించారు. సురబి వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం ఇక్కడి ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. నాణ్యమైన మంచినీటి సరఫరాను తక్కువ ధరకు అందించి అందరి మన్ననలు పొందాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీనియర్ నాయకులు ప్రభాకర్, ప్రసాద్, రంగస్వామి, నరేందర్, శివ, బాబా స్థానిక నేతలు, బిజెపి నాయకులు, కాలనీ వాసులు, కార్యకర్తలు పాల్గొన్నారు.