చాకలి చెరువును సందర్శించిన గజ్జల యోగానంద్

నమస్తే శేరిలింగంపల్లి: అధికార పార్టీ నాయకులు చెరువులను కబ్జా చేస్తూ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని బిజెపి శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జీ గజ్జల యోగానంద్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ లోని చాకలి చెరువును శేరిలింగంపల్లి బిజెపి అసెంబ్లీ ఇంచార్జి గజ్జల యోగానంద్, బిజెపి నాయకులతో‌ కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాకలి చెరువు బఫర్ జోన్ లో అధికార పార్టీ నాయకులు చట్ట విరుద్ధంగా స్థలాలను ఆక్రమిస్తున్నారని అన్నారు. చెరువు చుట్టూ పరిశుభ్రతలేని పరిస్థితులు, అధికార పార్టీ నేతల కబ్జాలే కనిపిస్తున్నాయన్నారు. పరిసర ప్రాంతాల్లోని మురికినీరు చాకలి చెరువులోకి ప్రవహిస్తుండడంతో చెరువులోని నీరంతా కలుషితమవుతోందని వాపోయారు. బఫర్ జోన్‌లో చట్టవిరుద్ధంగా ఆక్రమణలు జరుగుతున్నాయని, అందులో భాగంగా ఒక చర్చి నిర్మాణానికి పునాదులు కూడా వేశారన్నారు. సంబంధిత అధికారులు వెంటనే కబ్జాలను నిలువరించాలని గజ్జల యోగానంద్ డిమాండ్ చేశారు. ఆయ‌న వెంట బిజెపి శేరిలింగంపల్లి డివిజన్ ‌అధ్యక్షుడు రాజుశెట్టి కురుమ, బిజెపి నాయకులు తదితరులు ఉన్నారు.

చాకలి చెరువును సందర్శించిన గజ్జల యోగానంద్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here