నమస్తే శేరిలింగంపల్లి: సీసీ కెమెరాల ఏర్పాటుతో శాంతిభద్రతల పరిరక్షణకు పాటు పడిన వారమవుతామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని ఫ్రెండ్స్ కాలనీలో అసోసియేషన్ వారు రూ. 5 లక్షలతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మాదాపూర్ డీసీపీ కె. శిల్పవల్లి, మియాపూర్ ఏసీపీ ఎస్. కృష్ణ ప్రసాద్, చందానగర్ సీఐ క్యాస్ట్రో, చందానగర్ కార్పొరేటర్ మంజుల రెడ్డితో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. సీసీ కెమెరాలను ప్రతి కాలనీలో ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. డీసీపీ శిల్పవల్లి సీసీ కెమెరాల ఏర్పాటు, డ్రగ్స్ నిర్మూలన పై అవగాహన కల్పించారు. ఫ్రెండ్స్ కాలనీలో అసోసియేషన్ వారు ఐక్యంగా ఉండి రూ. 5 లక్షల విలువైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమని అన్నారు. సీసీ కెమెరాల ఆవశ్యకత ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతైనా అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ లు అహ్మద్ పాషా, ఎన్. శ్రీధర్, ఫ్రెండ్స్ కాలనీ అధ్యక్షుడు డి. వెంకటేశం, నవీన్, కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
