నమస్తే శేరిలింగంపల్లి: అహింస అనే ఆయుధాన్ని ధరించి బ్రిటీష్ వారిని తరిమి కొట్టి స్వాతంత్ర్యాన్ని తీసుకువచ్చిన మహోన్నతుడు మహాత్మ గాంధీ అని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. మహాత్మ గాంధీ వర్థంతినిపురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ పరిధి పాపి రెడ్డి కాలనీలోని గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. గాంధీజీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో పయనించాలని సూచించారు.
అనంతరం పాపి రెడ్డి కాలనీలో నెలకొన్న ఆయా సమస్యలపై బస్తీ బాట కార్యక్రమం చేపట్టి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. డ్రైనేజీ, సిసి రోడ్లు, డంపింగ్ యార్డ్, స్పోర్ట్స్ గ్రౌండ్, వీధి దీపాలు, కరెంట్ మీటర్స్, పెన్షన్స్, రేషన్ కార్డులు తదితర వాటి పరిష్కారానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని త్వరలో సంబంధిత అధికారులతో కలిసి సమస్యలను పరిష్కరించేలా చూస్తామని రవికుమార్ యాదవ్ హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు కంచర్ల ఎల్లేష్, రమేష్, నరసింహ, అప్పారావు, భరత్, గణేష్ ముదిరాజ్, లక్ష్మణ్ ముదిరాజ్, శ్రీను, రాము, కోటి, నీలకంఠ రెడ్డి, అఖిల్ ,హరీష్, విజయ్ యాదవ్, అరుణ, పుష్పలత, విజయలక్ష్మి, రాజమణి, తదితరులు పాల్గొన్నారు.