నమస్తే శేరిలింగంపల్లి: ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ను వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ను శాలువాతో సన్మానించి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ జోన్ బిల్డర్ అసోసియేషన్ సభ్యులు కె వి ప్రసాద్ రావు, చెన్నారెడ్డి, పుల్లారావు, పవన్ నాయుడు, లక్ష్మీపతి రాజు తదితరులు పాల్గొన్నారు.