నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ శిల్పారామంలో కొనసాగుతున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాలో ప్రజలకు అవసరమయ్యేలా చేనేతలు తమ హస్తకళలతో రూపొందించిన అన్ని రకాల వస్తువులను స్టాల్స్ లో విక్రయిస్తున్నారు. మేళాలో భాగంగా సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కూచిపూడి, కథక్ నృత్య ప్రదర్శనలు పలువురిని ఎంతగానో అలరించాయి. లక్ష్మి శంకర్ శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలో భాగంగా వినాయక కవిత్వం, అనుగ్రహితం (గురు స్తుతి), కోలేనిదోపరికి, ఆంజనేయం సదా (నోటు స్వరం), మరకత మణిమయ అంశాలను కళాకారులు ఆశ్రిత, అమృత, గాయత్రీ, నళిని రితిక, సాహితి తదితరులు ప్రదర్శించారు.
కథక్ నృత్య ప్రదర్శనలో భాగంగా అర్చన మిశ్ర శిష్య బృందం గురువందన, రాజ్ భైరవి, నృత్య సంగీత్, కథక్ మ్యూజిక్, కళావతి తరణ, సుందర గోపాల్, కథక్ రంగాయం తదితర అంశాలను కళాకారులు అర్చన మిశ్రా, కేయా, శ్రేయ సుమన్, సాగరిక, ఆకృతి, గాయత్రీ, ప్రవర్తిక, శ్రియ, నమిత ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.