నమస్తే శేరిలింగంపల్లి: హిందూ నాగరికత వైభవాన్ని పెంచే దిశగా భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాశీ విశ్వనాథ ఆలయం సుందరీకరణకు శంకుస్థాపన చేయడం గర్వకారణమని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ అన్నారు. దివ్య కాశీ భవ్య కాశీ కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని ధర్మపురి క్షేత్రంలోని శివాలయంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ కుటుంబ సమేతంగా పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాశీ సుందరీకరణ, అభివృద్ధి పనులకు(కాశీ విశ్వనాథ్ ఆలయ కారిడార్)ను ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడం సంతోషకరమని జ్ఞానేంద్ర ప్రసాద్ అన్నారు. నాగరికత వైభవాన్ని, ఐశ్వర్యాన్ని తిరిగి పొందే దిశగా ఇది ఒక ప్రతిష్టాత్మక అడుగు అని అన్నారు. యావత్ హైందవ జాతి ఆనందానికి ఐక్యతకు నిదర్శనం అని పేర్కొన్నారు. అణువణువూ మహాదేవుని నామం ప్రతిధ్వనించే ‘కాశీ ధామ్’ మహత్తరమైందని తెలిపారు. కాశీ విశ్వనాథుని గొప్ప రూపం, కాశీ విశ్వనాథ్ ధామ్ ను ప్రధాని నరేంద్రమోదీ దేశప్రజలకు అంకితం ఇవ్వనున్నారు అని పేర్కొన్నారు. దివ్య కాశీ, భవ్య కాశీ స్వీయ ప్రకాశితమైన కాశీ సమస్త మానవాళిని ప్రకాశితం చేస్తుందన్నారు.