నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ లోని సెంట్రల్ పార్క్ ఫేజ్- 2లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశానికి స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హాజరయ్యారు. నార్నే ఎస్టేట్ వారు డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చెయ్యకుండా కాలయాపన చేస్తున్నారని బాధితులు వాపోయారు. కష్టపడిన సొమ్ముతో స్థలాలను కొనుక్కుని నష్టపోయామని కార్పొరేటర్ దృష్టికి అసోసియేషన్ సభ్యులు తీసుకువచ్చారు. న్యాయం జరిగేలా చేస్తానని రాగం నాగేందర్ యాదవ్ హామీ ఇచ్చారు. అనంతరం అసోసియేషన్ సభ్యులతో కలసి కాలనీలోని పలు సమస్యలపై పాదయాత్ర నిర్వహించారు. సెంట్రల్ పార్క్ ఫేజ్ -2 లోని సమస్యలను పరిష్కరించి మోడల్ కాలనీ గా తీర్చిదిద్దుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ పార్క్ ఫేజ్ 2 ప్రెసిడెంట్ రమణి, కిషోర్, జయంత్,నాగేందర్ నాయక్, నాగరాజు, లక్ష్మణ్ యాదవ్, సాయి, రమేష్, కాలనీ వాసులు పాల్గొన్నారు.