రూ.2లక్షల ఎల్ఓసీని అందజేసిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, సీఎంఆర్ఎఫ్ తో పేదలకు ఆర్థిక సహాయం అందుతోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ రామ్ నగర్ కాలనీ ఏ బ్లాక్ కి చెందిన వనజాక్షి అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 2 లక్షల ఎల్ ఓ సీ మంజూరుపత్రాలను గురువారం బాధిత‌ కుటుంబానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ చౌదరీ, అనిల్ కావూరి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

రూ.2లక్షల ఎల్ ఓ సీ ని అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here