నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జోనల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ గా బాధ్యతలు చేపట్టిన శంకర్ ను శేరిలింగంపల్లి జోనల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జోనల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓర్సు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లు జోనల్ కార్యాలయంలో శంకర్ ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను సూపరింటెండెంట్ ఇంజనీర్ శంకర్ దృష్టికి తీసుకెళ్లారు. జీహెచ్ఎంసీ పరిధిలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులను సకాలంలో ఇచ్చేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి ఏడీ మధు, కాంట్రాక్టర్లు రామచందర్, నవీన్ గౌడ్, రాజ్ కుమార్, బి.నర్సింహా, ఆర్.వెంకటేశ్, చంద్రయ్య, మల్లికార్జున్, శివముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.