నమస్తే శేరిలింగంపల్లి:వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేసేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కును బాధితుని కుటుంబ సభ్యులు అందుకున్నారు. కోకాకోలా కంపెనీ లో పని చేస్తున్న సత్యనారాయణ అనే కార్మికుని మేనకోడలు కు వైద్య చికిత్స నిమిత్తం డబ్బులు ఖర్చవగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 26 వేల చెక్కు మంజూరైంది. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఎల్. రూప్ సింగ్ సహకారంతో, తెలంగాణ ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ చొరవతో తెలంగాణ రాష్ట్ర కార్మిక విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 26 వేల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో కోకో కోలా కంపెనీ టీఆర్ఎస్ కేవీ జనరల్ సెక్రెటరీ ఆశ స్వామి, వైస్ ప్రెసిడెంట్ సల్వాది వెంకటయ్య పాల్గొన్నారు.