సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్‌లో గాంధీ జయంతి

గ‌చ్చిబౌలి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గ‌చ్చిబౌలిలోని సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్‌లో గాంధీ జ‌యంతిని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా గాంధీ చిత్ర‌ప‌టానికి శంషాబాద్ డీసీపీ ఎన్‌.ప్ర‌కాష్ రెడ్డి పూల‌మాల‌లు వేసి ఘ‌నంగా నివాళులు అర్పించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ నేటి త‌రం యువ‌త గాంధీ అడుగు జాడ‌ల్లో న‌డ‌వాల‌న్నారు. అక్టోబ‌ర్ 2ను ప్ర‌పంచ వ్యాప్తంగా అంత‌ర్జాతీయ అహింసా దినోత్స‌వంగా జ‌రుపుకుంటున్నార‌ని అన్నారు.

గాంధీ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించిన శంషాబాద్ డీసీపీ ఎన్‌.ప్ర‌కాష్ రెడ్డి, ఇత‌ర పోలీసు అధికారులు

ఈ కార్య‌క్ర‌మంలో అడ్మిన్ ఏడీసీపీ లావ‌ణ్య‌, క్రైమ్స్ ఏడీసీపీ ఇందిర‌, ఏడీసీపీ మాణిక్ రాజ్‌, ఏసీపీ ల‌క్ష్మీనారాయ‌ణ‌, ఏసీపీ సంతోష్ కుమార్, ఈవోడ‌బ్ల్యూ ఇన్‌స్పెక్ట‌ర్ హ‌నుమంత రావు, బాలాన‌గ‌ర్ ఎస్‌బీ ఇన్‌స్పెక్ట‌ర్ తిరుప‌తి రావు, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

కార్య‌క్ర‌మంలో మాట్లాడుతున్న డీసీపీ ఎన్‌.ప్ర‌కాష్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here