నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రంగారెడ్డి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు డిఎస్ఆర్‌కే ప్రసాద్ 50వ జన్మదినోత్సవ వేడుకలు మియాపూర్ ఎస్ఆర్ ఎస్టేట్స్ కమ్యునిటీ హాల్‌లో బుధవారం ఘనంగా జరిగాయి. అభిమానులు ఏర్పాటు చేసిన 50 కిలోల జన్మదిన కేకును సతీమణి రమాదేవితో కలిసి డిఎస్ఆర్‌కే కట్ చేశారు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్దఎత్తున పాల్గొని ప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి మాట్లాడుతూ డి ఎస్ ఆర్ కే ప్రసాద్ నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం హర్షణీయమని కొనియాడారు.
బిజెపి రాష్ట్ర నాయకులు మువ్వా సత్యనారాయణ మాట్లాడుతూ నేటి తరం యువతకు డిఎస్ఆర్‌కే మార్గదర్శకులు అన్నారు. అంతకుముందు డిఎస్ఆర్‌కే ప్రసాద్ కార్యాలయం నుండి ఎస్ఆర్ ఎస్టేట్ కమిటీ హాల్ వరకు పెద్ద ఎత్తున బాణాసంచాతో అభిమానులు, కార్యకర్తలు డిఎస్ఆర్ కె యువసేన ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ , జ్ఞానేంద్ర ప్రసాద్, జిల్లా నాయకులు లీలా ప్రసాద్, మారం వెంకట్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు నాగులు గౌడ్, శేరిలింగంపల్లి బిజెపి నాయకులు రాఘవేంద్రరావు, వెలగా శ్రీనివాస్, మహిపాల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు మాణిక్యరావు, కార్యదర్శి ఆకుల లక్ష్మణ్, బిజెపి రాష్ట్ర బి సి మోర్చా కార్యవర్గ సభ్యులు మహేష్ యాదవ్, సత్యనారాయణ, సాంబయ్య , ప్రేమ్ చంద్, గిరి తదితరులు పాల్గొని ప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలిపారు.